: వ్యతిరేక తీర్మానాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి: పార్థసారథి
రాష్ట్ర విభజన బిల్లును కేంద్రం వెనక్కి తీసుకునేలా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమదైన ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి పార్థసారథి గుంటూరు జిల్లా బాపట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు రాజ్యాంగ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. బిల్లు అసమగ్రంగా ఉందని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారన్నారు. అయితే, కేంద్రం మొండి వైఖరితో ముందుకు వెళతామనడం సరికాదని చెప్పారు. రాజ్యాంగ సవరణ 5 ప్రకారం పార్లమెంటుకు సుమోటోగా రాష్ట్ర విభజన చేసే హక్కు లేదని గాదె అన్నారు.