: పట్టపగలు రూ. 50 లక్షల దోపిడీ
బీహార్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చౌరాహి పట్టణంలోని యూకో బ్యాంకు బ్రాంచి వద్ద పట్టపగలు రూ.50 లక్షలు దోచుకున్నారు. బ్యాంకు ఉద్యోగి, ఓ గార్డు కలిసి బెగుసరాయ్ బ్రాంచి నుంచి చౌరాహి బ్రాంచికి నగదు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. సాయుధులైన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి వ్యాన్ ను అటకాయించారు. వారిని ఎదుర్కొన్న గార్డు రంజిత్ కుమార్ పై కాల్పులు జరిపారు. అనంతరం యాభై లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు. కాగా, గాయపడిన గార్డును ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం వేట మొదలుపెట్టారు.