: సైన్స్, టెక్నాలజీ రంగానికి నిధులను పెంచాల్సి ఉంది: ప్రధాని

సైన్స్, టెక్నాలజీ రంగాలకు దేశ జీడీపీలో కనీసం 2 శాతం నిధులను కేటాయించాల్సి ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. సైన్స్ అభివృద్ధి చెందాలంటే అందుకు తప్పకుండా నిధుల సాయం పెంచాల్సిందేనన్నారు. ఇందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగం కూడా నిధుల సాయం అందించాలని కోరారు. దక్షిణ కొరియాలాంటి దేశాల్లో సైన్స్ రంగానికి పెద్ద ఎత్తున నిధులు వెళుతున్నాయని.. అందులో పారిశ్రామిక రంగం పాత్ర కూడా గణనీయంగా ఉందని వివరించారు.

జమ్మూలో 101వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ ను ప్రధాని ఈ రోజు ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి కోసం అంతర్జాతీయ సైన్స్ కుటుంబంతో మమేకం అవుతామన్నారు. ప్రతిష్ఠాత్మక యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ నూక్లియర్ రీసెర్చ్ లో సభ్య దేశంగా చేరుతున్నట్లు ప్రకటించారు. అణు విద్యుత్, అంతరిక్షం, భూ ఉపరితల విజ్ఞాన రంగంలో భారత్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందన్నారు. ఇందుకు కారకులైన శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు.

More Telugu News