: రేపు శక్తిస్థల్ లో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మౌన దీక్ష?
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ఢిల్లీ శక్తిస్థల్ లో చేపట్టనున్న మౌన దీక్ష రేపు జరిగే అవకాశం ఉంది. ఇందులో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్సతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. దీనికి గాను ఒకరోజు ముందే ఈ రోజు సాయంత్రం బొత్స, సి.రామచంద్రయ్య, కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు ఢిల్లీ వెళుతున్నారు. సమయాన్ని బట్టి ముఖ్యమంత్రి కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. 5వ తేదీ రాష్ట్రపతి అపాయింటుమెంట్ ఇవ్వొచ్చన్న సంకేతాలతో 4వ తేదీనే దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో పాటు, కేంద్ర మంత్రివర్గ బృందం సభ్యులను కొందరిని కలవనున్నారని తెలుస్తోంది.