: భారతీయ నావికులను రక్షించిన నైజీరియా దళాలు
పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఈక్విటోరియల్ గునియా తీరంలో సముద్రపు దొంగల చేతికి బందీలుగా చిక్కిన ముగ్గురు భారతీయ నావికులను నైజీరియా దళాలు విముక్తులను చేశాయి. ఈక్విటోరియల్ గునియాకు చెందిన నౌకను జనవరి 3న అట్లాంటిక్ సముద్ర దొంగలు పట్టుకున్నారు. నౌకా సిబ్బందిని బందీలుగా తీసుకువెళ్లారు. వీరిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. సమాచారం అందుకున్న నైజీరియా ప్రత్యేక దళాలు సముద్రపు దొంగల శిబిరంపై దాడి చేసి వీరికి విముక్తి కల్పించాయి.