: టీఆర్ఎస్ విలీనం చేయాల్సిందే.. బీజేపీ మద్దతిస్తుంది: దిగ్విజయ్ సింగ్
కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సిందేనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఓ ఆంగ్ల టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలు సహకరిస్తే పార్లమెంటు సమావేశాల్లో నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంటులో బీజేపీ పూర్తి మద్దతిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.