: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరు: వీరప్ప మొయిలీ
విభజన బిల్లును వెనక్కి పంపినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తిరస్కార తీర్మానం తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకి కాదని అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కోరామని ఆయన తెలిపారు. ఓటింగ్ గాని, తీర్మానం గాని కోరలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు సవరణలు చేసి పార్లమెంటులో ప్రవేశపెడతామని వీరప్ప మొయిలీ తెలిపారు.