: కేజ్రీవాల్ సమావేశాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన సమావేశాన్ని ఓక్లా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అసిఫ్ మహమ్మద్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సమావేశంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ గురించి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే, 'కేజ్రీవాల్ మోసగాడు' అని అరుస్తూ సమావేశాన్ని రసాభాస చేశారు. ముస్లింల సమస్యలను ఆయన విస్మరిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ నినాదాలు చేశారు. దాంతో, కేజ్రీవాల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను మోసం చేశారని, బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో న్యాయ విచారణ జరిపిస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు కాదంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. వెంటనే అధికారులు ఎమ్మెల్యేను అక్కడి నుంచి బలవంతంగా తీసుకుపోయారు.