: 15 రోజుల్లో తెలంగాణ కల సాకారమవుతుంది: కేసీఆర్
మరో 15 రోజుల్లో తెలంగాణ కల సాకారమవుతుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. రేపు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఢిల్లీ వెళ్తున్నానని... తెలంగాణ రాష్ట్రం తరఫున తిరిగి వస్తానని చెప్పారు. ఈ రోజు శాసనసభలో జరిగిన దాని గురించి తెలంగాణ ప్రజలెవరూ అధైర్యపడరాదని అన్నారు. అందరూ నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండాలని కోరారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి తలచుకుంటే శాసనసభనే రద్దు చేయగలరని... అలాంటిది బిల్లును తిప్పి పంపినంత మాత్రాన ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబులది ఉన్మాదమో?.. లేక తెలివితక్కువ తనమో? అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.