: బిల్లుమీద ఓటింగ్ జరగలేదు.. ఓటమి లేదు: రావుల
బిల్లు మీద ఓటింగ్ జరగలేదని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, బిల్లుపై ఓటింగ్ జరగకుండా గెలుపోటముల ప్రశ్న ఎలా వస్తుందని ప్రశ్నించారు. శాసనసభకు బిల్లు అభిప్రాయం చెప్పడం కోసం వచ్చిందే తప్ప, ఓటింగ్ కోసం రాలేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తీర్మానంకు విలువ లేదని ఆయన అన్నారు. శాసనసభకు ఆమోదించే, తిరస్కరించే అధికారం లేదని అన్నారు. చర్చ ముగిసిందని ప్రకటించిన తరువాతే ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. ఆ రకంగా చూస్తే ముఖ్యమంత్రి నోటీసు తీర్మానానికి ప్రాముఖ్యత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను మోసగించే వ్యాఖ్యానాలు చేయవద్దని సీమాంధ్ర నేతలకు ఆయన సూచించారు.