: నటి అమీషాపటేల్ కు షూటింగులో గాయాలు
బాలీవుడ్ నటి అమీషాపటేల్ షూటింగులో మెట్లపై నుంచి కింద పడింది. దాంతో, ఆమెకు గాయాలయ్యాయి. దానిపై సినిమా యూనిట్ మాట్లాడుతూ.. యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఓ వ్యక్తి మెట్లపై నుంచి తరుముతూ వస్తుండగా... అవే మెట్లపైనుంచి తొందరగా వస్తున్న అమీషా అకస్మాత్తుగా పడిపోయిందని చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె చేతికి, కాళ్లకు గాయాలవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.