: మరో పెళ్లి చేసుకుంటున్న హాలీవుడ్ హాట్ బ్యూటీ?

పాప్ గాయకురాలు బ్రిట్ని స్పియర్స్ మరోసారి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని హాలీవుడ్ మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. లీగల్ రీసెర్చర్ అయిన లుకాడో అనే వ్యక్తిని వివాహం చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వీరిద్దరూ సన్నిహితంగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో, ముప్పై రెండేళ్ల బ్రిట్ని చేతి వేలికి ఈమధ్య ఓ గోల్డ్ రింగ్ దర్శనవ్వడంతో వీరి 'బంధం' నిజమేనని అంతా అనుకుంటున్నారు. ఈ విషయం కాస్తా వీరి పెళ్లికి సంబంధించిన వార్తలకు మరింత బలం చేకూర్చింది. గతంలో తన మాజీ ఏజెంట్ జాసన్ ట్రావిక్ తో కొంతకాలం బ్రిట్ని సహజీవనం చేసింది. వివాహంతో ఒకటవుదామనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. అంతకుముందు ఆమె తన చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్ ని పెళ్లి చేసుకుంది. ఈ బంధం కూడా అప్పట్లోనే పెటాకులైంది!

More Telugu News