: కేజ్రీవాల్ ఎన్నిక రద్దు కోరుతూ కోర్టులో పిటిషన్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరుడు సోమనాథ్ భారతిల ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేతలు వీరేంద్ర గుప్తా, ఆర్తి మెహ్రా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం కేజ్రీవాల్, సోమనాథ్ లకు ఈ రోజు నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్, సోమనాథ్ భారతి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన పరిమితికి మించి ప్రచారం కోసం ఖర్చు చేశారని.. అందువల్ల వారి ఎన్నిక రద్దు చేయాలని బీజేపీ నేతలు కోర్టును కోరారు.

More Telugu News