: స్పీకర్ చాంబర్లో టీడీపీ, బయట వైఎస్సార్సీపీ ధర్నా
శాసనసభ ఆవరణలో ఉన్న స్పీకర్ చాంబర్ వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ చాంబర్లో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, చాంబర్ బయట వైకాపా ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. అసమగ్రంగా ఉన్న బిల్లును వెనక్కి తిప్పి పంపాలని సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. బిల్లుపై తమ తీర్మానాన్ని ఆమోదించి, ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వైకాపా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.