: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి: విద్యాసాగర్ రావు

రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన కొనసాగుతోందని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా వుందని కరీంనగర్ లో ఆయన మీడియాతో చెప్పారు. రాష్ట్రంలోని గందరగోళ పరిస్థితులకు ప్రభుత్వమే కారణమన్నారు. ఆర్టికల్-3పై చర్చించే అధికారం అసెంబ్లీకి లేదని విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు.

More Telugu News