: గురుద్వారాపై పిడుగు పడి.. పై కప్పు కూలింది
బ్రిటన్లోని లీసెస్టర్ నగరంలో ఉన్న గురుద్వారాపై పిడుగు పడింది. పై కప్పు కూలిపోయినా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 11 మంది పెద్ద వయసు మహిళలు ప్రార్థనలు చేస్తుండగా, పిడుగు పడి పైకప్పునకు రంధ్రం పడింది. దీంతో, భక్తులంతా భయపడి బయటకు పరుగులు తీసారు. కాసేపటికే పైకప్పుతో పాటు వెనుక వైపు గోడ కూడా కూలిపోయింది. ఓ వ్యక్తికి మాత్రం కొద్దిపాటి గాయాలయ్యాయి.
ఘటన జరగటానికి అరగంట ముందు కనుక పిడుగు పడి వుంటే పరిస్థితి దారుణంగా ఉండేదని, అప్పుడైతే 250 మంది భక్తులు లోపల వున్నారని గురుద్వారా కమిటీ అధ్యక్షుడు ఇండి పనేసర్ తెలిపారు. పై కప్పు కూలిపోయినా కూడా ఎవరికీ గాయాలు కాకపోవటం దేవుడి దయేనని పనేసర్ అన్నారు.