: భార్య నుంచి శాశ్వతంగా ప్రియురాలి చెంతకు ఫ్రాన్స్ అధ్యక్షుడు!

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే ఇన్నాళ్లూ సాగించిన రహస్య ప్రేమాయణం ఇక బహిరంగం కానుందేమో! తన భార్య ట్రయర్ వీలర్ తో వివాహ బంధాన్ని తెంచుకుంటున్నట్లు హాలండే(59) ప్రకటించారు. దీనంతటికీ ఆయన రహస్య ప్రేమాయణం వెలుగులోకి రావడమే కారణం. హాలండే హెల్మెట్ పెట్టుకుని రాత్రివేళ ఎవరూ గుర్తించకుండా పారిస్ లో నటి జూలీ గయెట్(41) ఇంటికి వెళుతున్న దృశ్యాలను క్లోజర్ అనే పత్రిక రెండు వారాల క్రితం బయటపెట్టింది. ఇది తెలిసిన వెంటనే హాలండే భార్య, ఫ్రాన్స్ ప్రథమ పౌరురాలు ట్రయర్ వీలర్ ఆందోళనతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ సమయంలో హాలండే ఆమెతో అనుబంధానికి ముగింపు పలకడం చూస్తుంటే.. జూలీ చెంతకు చేరడానికేననే వార్తలు వినిపిస్తున్నాయి.

More Telugu News