: కోర్టు విచారణకు హాజరైన కేసీఆర్
ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన కేసులో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ రోజు హన్మకొండ కోర్టులో విచారణకు హాజరయ్యారు. పరకాల ఉప ఎన్నిక సందర్భంగా 2012 మే 20న ఆత్మకూరు ఎన్నికల సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందంటూ ఆయనపై కేసు దాఖలైంది. ఈ కేసు విచారణ కోసం కేసీఆర్ హన్మకొండ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చారు. కాగా, విచారణ జూన్ 9కి వాయిదా పడింది.