: విజయవాడలో ఆమ్ ఆద్మీ సమావేశం రసాభాస
విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం రసాభాసగా మారింది. సమైక్యవాదులు సమావేశ మందిరంలోకి చొచ్చుకొచ్చి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. జై సమైక్యాంధ్ర నినాదాలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ఉద్యమకారులు కోరారు. దానికి వారు విముఖత తెలుపుతూ హైకమాండ్ తో మాట్లాడి ప్రకటన చేయిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ సమైక్య ఉద్యమకారులు వినకపోవడంతో సమావేశం జరుపకుండా నిష్క్రమించారు. అవినీతిని అంతం చేస్తామని, సమగ్ర పాలన అందిస్తామని చెబుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాష్ట్రం ముక్కలు కావడానికి మద్దతివ్వడం సరికాదని అన్నారు. తక్షణం ఆ పార్టీ తమ ఉద్దేశాన్ని మార్చుకోవాలని ఉద్యమకారులు సూచించారు.