: సీఎం చర్య రాజ్యాంగ ఉల్లంఘనే: పొంగులేటి

రాష్ట్ర విభజన బిల్లును వెనక్కి పంపే విషయమై తీర్మానం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభాపతికి నోటీసు ఇవ్వడాన్ని అదే పార్టీకి చెందిన తెలంగాణ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తప్పుబట్టారు. బిల్లు తప్పుల తడక అని, ఇలాంటి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయరాదని రాష్ట్రపతిని కోరుతూ తీర్మానం చేయాలని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రూల్ 76, 77 కింద కనీసం పది రోజుల ముందుగా సభాపతికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని.. కానీ సీఎం నాలుగు రోజులే సభా సమయం మిగిలి ఉండగా ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పొంగులేటి అన్నారు. సీమాంధ్రుల కుట్రలో భాగంగానే బిల్లును వెనక్కి పంపాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

More Telugu News