: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ నరసింహన్
65వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, రాష్ట్ర మంత్రులు, పొన్నాల లక్ష్మయ్య, సి.రామచంద్రయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.