: రాఖీ సావంత్ ను సీఎం అభ్యర్థిగా నిలబెట్టండి: ఏఏపీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంటే బాలీవుడ్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ చాలా నయమని సామ్నా పత్రిక సంపాదకీయంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే రాసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ స్పందించింది. రాఖీకి ఠాక్రే అంత ఉన్నతమైన గౌరవం ఇస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలని ఏఏపీ నాగ్ పూర్ యూనిట్ స్టేట్ కన్వీనర్ అంజలి దమనియా అన్నారు. 'మహారాష్ట్రలో శివసేన పార్టీ చాలా చెత్త పార్టీ' అని ఆమె వ్యాఖ్యానించారు.

More Telugu News