: మూడు రాజ్యసభ స్థానాలకు 39 నామినేషన్లు!

రానున్న రాజ్యసభ ఎన్నికలకు ఈశాన్య రాష్ట్రం అస్సాం నుంచి భారీ పోటీ ఏర్పడింది. ఏకంగా 39 మంది ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఆ రాష్ట్రంలోని నలుగురు మాజీ ఎంపీలు ఉన్నారని అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి బిచిత్ర చౌదరి తెలిపారు. ఈ రాష్ట్రం నుంచి కేవలం మూడు స్థానాలకే అవకాశం ఉండగా, ఇంతమంది పోటీపడటం గమనార్హం. అయితే, పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న తర్వాత రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను రేపు ఎంచుకోనున్నట్లు చౌదరి చెప్పారు.

More Telugu News