: ఫేస్ బుక్ పతనం కావడం ఖాయం!
ప్రపంచమంతా అంటువ్యాధిలా వ్యాపించిన ఫేస్ బుక్ రానున్న రోజుల్లో పూర్తిగా అంతరించిపోనుంది. 2017 నాటికి కనీసం 80 శాతం మంది వినియోగదారులు ఫేస్ బుక్ తో విసిగిపోయి, దాన్ని వదిలేస్తారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఫేస్ బుక్ మనుగడపై లోతైన పరిశోధనలు నిర్వహించారు. ఇప్పటికే అనేకమంది ఫేస్ బుక్ బారినపడి అనేక సమస్యలను కొనితెచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో ఫేస్ బుక్ వల్ల జీవితాలే నాశనం కానున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.