: రూ.5 వేలిస్తే.. శుక్రవారమూ ప్రేమ మందిర సందర్శనం

షాజహాన్, ముంతాజ్ ల ప్రేమ చిహ్నం తాజ్ మహల్ ను ఇకపై శుక్రవారమూ సందర్శించుకోవచ్చు. కాకపోతే పర్సు కాస్త బరువుగా ఉండాలి. అందులో కనీసం ఓ ఐదు వేల రూపాయలైనా ఉండాలి. ఇప్పటి వరకు శుక్రవారాల్లో తాజ్ మహల్ లోకి సందర్శకులను అనుమతించడం లేదు. కానీ, ఇకపై శుక్రవారాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సందర్శకులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఆ రోజు వరకు టికెట్ ధరను రూ.5వేలుగా నిర్ణయించారు.

More Telugu News