: పద్ధతి ప్రకారం సంస్కృతిని నాశనం చేశారు: ఎమ్మెల్సీ నాగేశ్వర్
తెలంగాణ సంస్కృతిని ఒక పద్ధతి ప్రకారం నాశనం చేశారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు. ఎట్టకేలకు తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరనుందని ఆయన అన్నారు. తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్‌ను సమైక్య ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇదే జిల్లాకు చెందిన సుప్రసిద్ధ కోటి లింగాల జాతరకు పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కలేదని నాగేశ్వర్ విమర్శించారు. తెలంగాణలోని సకల సమస్యలకూ ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమని నాగేశ్వర్ స్పష్టం చేశారు.