: శాసనసభ లాబీలో బొత్స, జేసీ మధ్య వాగ్వాదం!

కాంగ్రెస్ లో రాజ్యసభ ఎన్నికల పంచాయతీ మొదలైంది. ఈ రోజు శాసనసభ లాబీలో దీనిపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటూ.. సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి రాజ్యసభకు పోటీ చేయబోతున్నారని అన్నారు. దానిపై అక్కడే ఉన్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మండిపడుతూ.. ఎలా పోటీ చేస్తారు? అని అక్కడున్న జేసీని ప్రశ్నించారు. దాంతో, ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. రాష్ట్రాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జేసీ.. సోనియా, రాహుల్ గాంధీపై కొన్ని రోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ జేసీకి కాంగ్రెస్ షోకాజ్ నోటీసు పంపిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు జేసీని రాజ్యసభకు ఒప్పుకుంటారా? లేదా? అనేది అనుమానమే.

More Telugu News