: ఓటింగ్ పై తుది నిర్ణయం స్పీకర్ దే: శ్రీధర్ బాబు
తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ ఉండాలా? లేక కేవలం అభిప్రాయసేకరణే సరిపోతుందా? అనేది స్పీకర్ నిర్ణయిస్తారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బిల్లును సభ ముందు ఉంచామని... దాని అర్థం బిల్లును సభలో ప్రవేశపెట్టినట్టేనని అన్నారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3 ప్రకారమే ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.