: అమెరికా కాన్సులేట్ ఎదుట ధర్నా

భారత దౌత్యాధికారిని దేవయాని ఖోబ్రాగాడే పట్ల అమెరికా తీరును యావత్ భారతదేశం నిరసిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బేగంపేటలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ వద్ద సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు విద్యార్థి సంఘాలతో పాటు అనేక మంది తమ సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ధర్నాలో పాల్గొన్న వారందరూ అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికాకు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా కాన్సులేట్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాన్సులేట్ లోకి ప్రవేశం లేదని బోర్డులు కూడా పెట్టారు. కాన్సులేట్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పలువురు సీపీఐ కార్యకర్తలు, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News