: వారిపై చర్యలు తీసుకోండి: హరీష్ రావు
సభను అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకుని సభను సజావుగా నడిపించాలని టీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పీకర్ ను డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ పూర్తి చేయించే బాధ్యత తెలంగాణ మంత్రులదేనని అన్నారు. వాయిదాలతో సభను నడపడం అప్రజాస్వామికమన్నారు. తెలంగాణ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్ ఆడడం సరైన పద్దతి కాదన్నారు. గతంలో రాష్ట్రాల విభజన బిల్లుపై చర్చ రెండు రోజుల్లోనే ముగిసిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు 42 రెండు రోజులు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.