: రాష్ట్ర విభజనకు కిరణ్, బాబు సహకరిస్తున్నారు: శోభా నాగిరెడ్డి
సమైక్యం ముసుగులో సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. సమైక్య తీర్మానానికే వైకాపా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. బిల్లు అసమగ్రంగా ఉందని... పూర్తి సమాచారం లేకుండా దానిపై చర్చ సాధ్యం కాదని తెలిపారు. ఆదాయం, అప్పులు, ఆస్తులు తదితర వివరాలను ముసాయిదాలో పొందుపరచలేదని చెప్పారు.