: స్పీకర్ కు టీడీపీ లోక్ సభ సభ్యుడు నామా నోటీసు

భారత దౌత్యాధికారి దేవయానిపై అమెరికా అనుసరించిన తీరుకు నిరసనగా స్పీకర్ కు తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు నోటీసు అందజేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేసి దీనిపై చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వీసా మోసం కేసులో న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ గా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రాగాడేను విచారించే విషయమై ఆమె పట్ల అమెరికా పోలీసులు అనాగరికంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

More Telugu News