: మంటగలిసిన మానవత్వం.. ఆస్తి కోసం అక్క శవాన్ని ఈడ్చుకెళ్ళారు!

మానవత్వం మంటగలిసింది. ఆస్తి కోసం అయినవారు కాట్లకుక్కల్లా వాదులాడుకుని సంస్కారాన్ని మరచి అంతిమ సంస్కారం కోసం కొట్లాడుకున్నారు. అనంతపురం జిల్లా అమరాపురం మండలం వలస గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(85) అనారోగ్య కారణంగా కాలధర్మం చెందింది. అంతకు పదేళ్లకు ముందే ఆమె భర్త పూజారప్ప మరణించాడు. వీరికి పిల్లలు లేరు. ఐదెకరాల పొలం, ఇల్లు ఉన్నాయి.

లక్ష్మమ్మ మృతి చెందడంతో అంత్య క్రియలు ఎవరు చేస్తే వారికే ఆస్తి దక్కుతుందనే ఉద్దేశ్యంతో.. పూజారప్ప సోదరులు, లక్ష్మమ్మ చెల్లెళ్లు దహన సంస్కారాలు తాము చేస్తామంటే తామే చేస్తామంటూ గొడవపడ్డారు. ఈ క్రమంలో లక్ష్మమ్మ మృతదేహాన్ని అంతిమ సంస్కారానికి తీసుకెళ్లాల్సిన బంధువులు, పూజారప్ప సోదరులను లక్ష్మమ్మ చెల్లెళ్లు అడ్డుకున్నారు. దీంతో వారిద్దరే మృతదేహాన్ని ఎత్తుకెళ్లలేక తాడుకట్టి లాక్కెళ్తుండగా గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. చివరకు పోలీసుల సహాయంతో మృతదేహానికి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు.

More Telugu News