: కృష్ణజింకల కేసులో సల్మాన్ పై ఎలాంటి సాక్ష్యం లేదట!

కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై ఎలాంటి ప్రత్యక్ష ఆధారాలు లేవని న్యాయవాది హస్తిమల్ సారస్వత్ తెలిపారు. ఈ మేరకు జోధ్ పూర్ జిల్లా కోర్టుకు ఆయన విన్నవించారు. కోర్టులో ఈ రోజు ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో.. 1998 జోధ్ పూర్ లోని కొంకణి గ్రామానికి దగ్గరలోని అడవుల్లో జరిగిన ఘటనకు సంబంధించి తాను అడిగిన ముఖ్యమైన ప్రశ్నలకు అటవీ అధికారి సరైన సమాధానాలు ఇవ్వలేదని సల్మాన్ న్యాయవాది చెప్పారు. తిరిగి విచారణను మేజిస్ట్రేట్ జనవరి 15కు వాయిదా వేశారని వెల్లడించారు.

More Telugu News