: అన్నా, రాహుల్ పరస్పరాభినందనలు

కీలకమైన లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నంలో పడ్డారు. లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారే ఆమరణ దీక్ష చేస్తుండడంతో రాజ్యసభలో ఉన్న సవరణ బిల్లును ఆమోదింపజేయడానికి రాహుల్ స్వయంగా రంగంలోకి దిగారు. తద్వారా కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటే ప్రయత్నంలో పడ్డారు.

ఇప్పటికే ప్రతిపక్షాల మద్దతు కోరిన రాహుల్ ఈ రోజు ఉదయం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి నారాయణ సామిలను పిలిచారు. సభలో బిల్లు ఆమోదింపజేయడానికి తగిన వ్యూహాన్ని వారితో కలిసి రాహుల్ రూపొందించనున్నారు. మరోవైపు రాహుల్ అంకితభావాన్ని అభినందిస్తూ అన్నాహజారే రాసిన లేఖ ఆయనను చేరింది. ఇందుకు రాహుల్ కూడా అన్నాకు కృతజ్ఞతలు చెప్పారు. దేశానికి బలమైన లోక్ పాల్ బిల్లు అందివ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అన్నా పాత్రను అభినందిస్తున్నామన్నారు.

More Telugu News