: కామన్ క్యాపిటల్ అంటే ఇద్దరు ముఖ్యమంత్రులెలా పరిపాలిస్తారు?: చంద్రబాబు
దేశ చరిత్రలో ఉమ్మడి రాజధాని అనే అంశం ఎక్కడా లేదని.. అలాంటిది ఇక్కడ కామన్ క్యాపిటల్ అంటే రెండు రాష్ట్రాలకు హక్కులు ఎలా కల్పిస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాదును ఎలా పరిపాలిస్తారని ఆయన అడిగారు. దీనిపై రాజ్యాంగ సవరణ ఎలా చేస్తారని బాబు నిలదీశారు.
రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోన్న కేంద్రం.. ప్రజలకు ఎలా న్యాయం చేస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలు, నేతలు విభజన మత్తులో ఉన్నారని చెప్పి.. కేంద్రం ప్రజా ప్రతినిధుల అధికారాలు తీసుకుంటుందా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రులంతా చేతకానివాళ్లని, నేతలకు వెన్నుముక లేదని చెప్పి తమకు ఇష్టం వచ్చిన రీతిలో విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన దుయ్యబట్టారు.