: లోక్ పాల్ పై అఖిలపక్షం.. ఎస్పీ, బీఎస్పీ గైర్హాజరు
లోక్ పాల్ బిల్లుపై రాజ్యసభ చైర్మన్ (ఉపరాష్ట్రపతి) హమీద్ అన్సారీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎస్పీ, బీఎస్పీలు మినహా మిగిలిన పార్టీలన్నీ హాజరయ్యాయి. యూపీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న లోక్ పాల్ బిల్లును ఎస్పీ, బీఎస్పీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు అఖిలపక్షం సమావేశానికి గైర్హాజరయ్యాయి. అఖిలపక్షానికి హాజరైన మిగిలిన పార్టీలన్నీ రేపు రాజ్యసభలో లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టడానికి అంగీకరించినట్టు సమాచారం.