: ఒకే కాన్పులో 10 మంది శిశువులకు జననం.. అందరూ మృతి

మధ్యప్రదేశ్ లో ఒక మహిళ ఒకే కాన్పులో నెలలు నిండని 10 మంది శిశువులను ప్రసవించి రికార్డు నమోదు చేసింది. దురదృష్టవశాత్తూ వారిలో ఒక్కరూ బతకలేదు. భారత్ లో ఒక మహిళ ఒకేసారి ఇంత మందిని ప్రసవించడం ఇదే మొదటి సారి. రేవా జిల్లాలోని కోటి గ్రామానికి చెందిన అంజు కుష్వహను ఆదివారం సంజయ్ గాంధీ ఆస్పత్రికి తీసుకువస్తుండగా.. దారి మధ్యలోనే తొమ్మిది మందిని ప్రసవించగా.. మరో శిశువును డాక్టర్లు సర్జరీ చేసి తీశారు. కానీ ఒక్కరూ జీవంతో లేరని డాక్టర్లు ప్రకటించారు. కాగా, 1971లో రోమ్ లో ఒక మహిళ 15మందిని ప్రసవించినదే ప్రపంచ రికార్డుగా ఉంది.

More Telugu News