: ఉస్మానియా వర్శిటీలో ఉద్రిక్తత
హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం శాసన సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సీమాంధ్ర ఎమ్మెల్యేలు నిరసన తెలపడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో తక్షణం ఆమోదించేలా చూడాలని రాష్ట్ర గవర్నరుని కలిసి డిమాండ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు.
అనుకున్న వెనువెంటనే రాజ్ భవన్ ను ముట్టడించేందుకు ఓయూ విద్యార్థులు బయల్దేరారు. ఎన్ సీసీ గేటు వద్దకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంతో వారు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై విద్యార్థులపై భాష్పవాయువుని ప్రయోగించి.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, యూనివర్శిటీ నుంచి బయటకు వచ్చేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ వారిని నిలువరించేందుకు భారీ పోలీసు బలగాలు మోహరించాయి.