: ఇదో వెరైటీ హౌస్!
ఇల్లు కట్టడానికి ఎలాంటి ప్రదేశం కావాలి... రాతినేల... చక్కటి విశాలమైన మట్టితో కూడిన మైదానం ... ఇలా మనం ఎంపిక చేసుకుంటాం. అలాకాకుండా చక్కగా దొరికిన పెద్ద రాయినే ఇల్లుగా మార్చేసుకుంటే... అది వెరైటీ ఇల్లు అవుతుంది. ఇలాంటి వెరైటీ రాతి ఇల్లును కట్టేశారు ఔత్సాహికులు. ఈ రాతి ఇల్లు ఇప్పుడు పర్యాటకులను విపరీతంగా ఆకర్షించేస్తోంది.
పోర్చుగల్లోని ఫేఫ్ పర్వతాల మధ్య రెండు కొండరాళ్ల మధ్య చిన్న ఖాళీ ఉంటుంది. ఆ చిన్న ఖాళీ జాగాను కూడా కాంక్రీట్ మిశ్రమంతో భర్తీ చేసేసి పెద్ద కొండరాయిలాగా మలిచారు. అంతేకాదు... ఈ రాళ్లను తొలిచేసి చక్కగా లోపల నివాసం ఉండడానికి వీలుగా ఏర్పాట్లు కూడా చేశారు. ప్రఖ్యాత అమెరికన్ కార్టూన్ ఫ్లింట్స్టోన్ స్ఫూర్తితో రూపొందినట్టుగా ఉండే ఈ రాక్ హౌస్కు కిటికీలు, ఒక తలుపు కూడా ఉన్నాయి. దీన్ని చూడడానికి పర్యాటకులు తెగ ఉత్సాహంగా వస్తున్నారట. అయినా సృజనకు ఏదీ అడ్డుకాదు మరి! అంతేకాదు, ఇలాంటి ఇళ్లు కట్టడానికి ఇటుకల ఖర్చు కూడా ఉండదు కదూ!