: అంతరిక్షంలోకి రెండోసారి కోతిని పంపిన ఇరాన్

అసాధ్యం అనుకునే వాటిని.. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సుసాధ్యం చేయడానికి ఇరాన్ దేశం తరచూ ప్రయత్నిస్తుంటుంది. ఇందులో భాగంగానే ఆ దేశం తాజాగా అంతరిక్షంలోకి రెండోసారి కోతిని పంపింది. ఈ ప్రయోగం విజయవంతంగా జరిగిందని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు. భవిష్యత్తులో మానవుడిని రోదసిలోకి పంపే లక్ష్యంలో భాగంగానే ఈ ప్రయోగం చేపట్టినట్లు పేర్కొన్నారు. రాకెట్ లో తొలిసారి ఇంధనం నింపి పంపినట్లు చెప్పారు. అయితే, ఏ ప్రాంతం నుంచి రాకెట్ ప్రయోగాన్ని చేపట్టారో మాత్రం చెప్పలేదు. ఈ ఏడాది జనవరిలో ఇరాన్ తొలిసారి అంతరిక్షంలోకి కోతిని పంపింది.

More Telugu News