: జయలలిత దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉంది: దేవెగౌడ

దేశ రాజకీయాల్లో త్వరలో కొత్త పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. తాజాగా, జనతాదళ్(ఎస్) నేత, మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవెగౌడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో బలమైన రాజకీయాలు నెలకొన్నాయని, ఈ క్రమంలో 2014 లోక్ సభ ఎన్నికల తర్వాత దక్షిణాది నుంచి ఏఐఏడీఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తదుపరి దేశ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. 1996-97లో ఏర్పడిన పరిస్థితులు తనను ప్రధానమంత్రిని చేశాయన్న గౌడ.. ప్రస్తుతం అలాగే ఏఐఏడీఎంకె చేస్తున్న నినాదం 'అమ్మ ఫర్ పీఎమ్' నిజం కావచ్చని పేర్కొన్నారు. హిందు ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా భారతీయ రాజకీయాల్లో ఓ మార్పు రాబోతోందని తన అంతరాత్మ చెబుతుందన్నారు. ఇలాంటి రాజకీయ సమీకరణాల్లో తాను మనస్పూర్తిగా ప్రధాని పదవికి జయలలితకు మద్దతు తెలుపుతానని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో పెద్ద పాత్రను పోషించాలని పార్టీ కార్యకర్తలు అడిగితే జయ తనకు తానుగా ఎలాంటి అవకాశాన్ని వదులుకోరని వివరించారు.

More Telugu News