: ముంబయిలో భారీ అగ్నిప్రమాదం: ఆరుగురి సజీవ దహనం
ముంబయిలోని గృహసముదాయ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవదహనమయ్యారు. 26 అంతస్థుల భవనంలోని 12వ అంతస్థులో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.