: వచ్చే ఐపీఎల్ సీజన్లో చీర్ గర్ల్స్ కనిపించరు
ఫోర్ కొట్టినా, సిక్సర్ బాదినా తళుక్కుమనే చెమ్కీ పూదండలతో.. అర డ్రెస్ అందాలతో చిందులేసే చీర్ గర్ల్స్ వినోదాన్ని వచ్చే ఐపీఎల్ ఆటల్లో ప్రేక్షకులు మిస్ కానున్నారు. ఐపీఎల్ 7వ సీజన్లో చీర్ గర్ల్స్ ఉండరని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రవి సావంత్ చెప్పారు. ఐపీఎల్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. స్పాట్ ఫిక్సింగ్ తర్వాత బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ మొత్తం 10 సూచనలు చేసిందని.. వాటిని ఐపీఎల్ 7వ ఎడిషన్ నుంచి అమలు చేస్తామని చెప్పారు.