: సోనియాపై రాజద్రోహం కేసు పెడితే జగన్ ను నమ్ముతాం: పయ్యావుల

జగన్, కేసీఆర్ లతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల వల్లే ఇప్పటి సమస్య ఉత్పన్నమైందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. 2009 డిసెంబర్ 9నే ఈ సమస్యకు బీజం పడిందని తెలిపారు. కేవలం మొసలి కన్నీరు తుడవడానికే జగన్ దేశ యాత్రను చేపట్టారని ఎద్దేవా చేశారు. నిజంగా జగన్ సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నట్టైతే... సోనియాపై రాజద్రోహం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు అతని నైతికత ఎంతో అర్థమవుతుందని అన్నారు. ఈ పని ఎవరు చేసినా చేయకపోయినా... తాము మాత్రం రాజద్రోహం కేసు పెడతామని హెచ్చరించారు. ఏ రాష్ట్ర విభజన ప్రక్రియ అయినా ఆ రాష్ట్ర శాసనసభ నుంచే ప్రారంభం కావాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పారని పయ్యావుల తెలిపారు.

More Telugu News