: జైపూర్ పర్యటనను రద్దు చేసుకున్న చంద్రబాబు
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరారాజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిన చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీకి రావడంతో, ఆయన అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. దీంతో అతని జైపూర్ పర్యటన రద్దైంది.