: సర్వేలు కామెడీ షోలు: నితీశ్ కుమార్
ఎన్నికల సర్వేలు వినోదభరిత కార్యక్రమాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, సర్వేలన్నీ బూటకమన్నారు. 2005, 2010 లో బీహార్ లో హంగ్ ఖాయమని సర్వేలు బల్లగుద్ది మరీ చెప్పాయని, బీహార్ అసెంబ్లీ పరిధిలో ఉన్న 40 సీట్లలో 9 సీట్లను కూడా జేడీయూ గెలుచుకోలేదన్నాయని గుర్తు చేశారు. కానీ, అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ తాము అధికారంలోకి వచ్చామని తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిన అనంతరం సర్వేలన్నీ రాజకీయ మార్పు తథ్యం అని చెబుతుండగా, నితీశ్ మాత్రం సర్వేలన్నీ ఓ జోక్ అని కొట్టిపారేస్తున్నారు.