: నిర్మాతపై హీరోయిన్ సంజన తీవ్ర ఆరోపణలు

శివ కేశవ్ చిత్ర నిర్మాత నాగరాజు తనను లైంగికంగా వేధిస్తున్నాడని హీరోయిన్ సంజన అంటోంది. తనతో కొన్ని గంటలపాటు గడపాలని అతడు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించింది. అయితే, తాను అతడి కోరికను తిరస్కరించానని తెలిపింది. చాలామంది దర్శకులు, నిర్మాతలు.. హీరోయిన్లను, ఇతర నటీమణులను ఇలాగే వేధిస్తున్నారని వివరించింది. కాగా, ఆర్వీ సుబ్రమణ్యం దర్శకత్వంలో వస్తున్న శివ కేశవ్ చిత్రంలో సంజన.. నాగేంద్రబాబు, శ్వేతాబసు ప్రసాద్, జయంత్, రేణు శర్మలతో కలిసి నటిస్తోంది. దివంగత శ్రీహరి కూడా ఈ సినిమాలో నటించారు. సంజన.. బుజ్జిగాడు, యమహోయమ, పోలీస్ పోలీస్, నేనేం చిన్నపిల్లనా.. వంటి చిత్రాల్లో నటించింది.

More Telugu News