: ట్విట్టర్ ఖాతాలలో ఒక వంతు వాడనివే!

ట్విట్టర్, ఫేస్ బుక్.. ఈ రెండూ నేటితరం ప్రముఖ సోషల్ నెట్ వర్క్ వేదికలు. యూజర్లను ఆకర్షించడంలో, ఆకట్టుకోవడంలో ఫేస్ బుక్ ముందుండగా.. ట్విట్టర్ క్రమంగా ఆదరణ కోల్పోతోంది. రాయిటర్స్ సర్వే ఫలితాలే ఇందుకు నిదర్శనం. 1,067 మంది ట్విట్టర్ యూజర్లను విచారించగా.. అందులో 36 శాతం మంది తమ అకౌంట్ ను వాడడం లేదని చెప్పారు. 7 శాతం మంది తమ ఖాతాలను మూసేశామని వెల్లడించారు. 2,449 ఫేస్ బుక్ యూజర్లపై సర్వే చేయగా.. కేవలం 7 శాతం మందే తాము తమ అకౌంట్ ను వాడడం లేదని చెప్పారు. 5 శాతం మంది ఖాతాలను మూసేశామన్నారు. ట్విట్టర్ ఆదరణ కోల్పోవడానికి యూజర్లు చెబుతున్న కారణాలు.. తమ ఫ్రెండ్స్ కు అక్కడ ఖాతాలు లేకపోవడం, వాడుక కాస్తంత కఠినంగా ఉండడమేనట. అదీ ట్విట్టర్ విషాద గాథ.

More Telugu News