: భారత్ మాపట్ల సానుకూలంగా వ్యవహరించాలి: పాక్
భారత్ తమ పట్ల మరింత సానుకూలంగా వ్యవహరించాలని పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ అన్నారు. భారత్ తన విధానాన్ని కూడా మార్చుకోవాలని, అది ద్వైపాక్షిక సంబంధాలకు దోహదపడుతుందనీ అన్నారు. మరోవైపు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా జోక్యం అవశ్యం అన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చుక్కెదురైంది. కాశ్మీర్ సమస్య విషయంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా స్పష్టం చేసింది.